అన్‌స్టాపబుల్ షోకు ఆ ముగ్గురు స్టార్స్.. మాస్ జాతర ఎపిసోడ్ రాబోతుందంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే(Unstoppable with NBK) ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2025-03-28 08:09 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ( Balakrishna ) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే(Unstoppable with NBK) ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షో సక్సెస్‌ఫుల్‌గా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. అంతేకాకుండా ఇటీవల 4వ సీజన్ కూడా మొదలవడంతో పలువురు సినీ తారలు గెస్ట్‌లుగా వచ్చి సందడి చేశారు. అయితే ఈ అన్‌స్టాపబుల్ షోకు పలువురు రాజకీయ నాయకులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది కాలంగా బాలయ్య ‘అఖండ-2’(Akhanda-2) షూట్‌లో పాల్గొంటుండటంతో ఈ షోకు గ్యాప్ వచ్చింది. త్వరలో ఉగాది పండుగ ఉండటంతో మళ్లీ ఓ ముగ్గురు స్టార్ హీరోలను బాలయ్య గెస్టులుగా తీసుకురాబోతున్నారు.

ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేసి హైప్ పెంచారు. ఈ షోకు అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్‌(Ram Charan)తో పాటు వెంకటేష్(Venkatesh) కూడా రాబోతున్నారు. ‘‘బాలయ్య పండుగ నీ ఒక మాస్ క్లైమాక్స్ ఎపిసోడ్‌తో సీజన్‌ను ముగిద్దాం. మన గెస్ట్‌ల మాస్ మూమెంట్స్‌తో మిక్స్ అయిన మాస్ జాతర ఎపిసోడ్ ఈ ఉగాదికి మార్చి 29న 12 గంటలకు రాబోతుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News