యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాటకు మాస్ స్టెప్స్ వేసిన హిట్ డైరెక్టర్.. నెట్టింట ట్రెండింగ్‌గా మారిన వీడియో

రామ్ నితిన్(Ram Nithin), నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan) ప్రధాన పాత్రలో వచ్చిన ‘మ్యాడ్ -2’ చిత్రం(Mad-2 Movie) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-04-05 04:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: రామ్ నితిన్(Ram Nithin), నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan) ప్రధాన పాత్రలో వచ్చిన ‘మ్యాడ్ -2’ చిత్రం(Mad-2 Movie) ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైన వారంలోనే దాదాపు రూ.80 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా సక్సెట్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Junior NTR), దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Ssrinivas) గెస్టులుగా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీ‌ఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’(Andhrawala) సినిమాలోని ‘నాయిరే నాయిరే’(Naire Naire) సాంగ్‌కు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) మాస్ స్టెప్స్ వేశారు. అంతేకాకుండా చివరగా జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్‌(Ram Prasad) కూడా అతనితో మాస్ స్టెప్పులు కలిపారు. ఇక డైరెక్టర్ డ్యాన్స్ చూసి స్టేజ్ మొత్తం క్లాప్స్‌తో దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Tags:    

Similar News