నువ్వే నా జీవితం అంటూ అతనితో క్యూట్ ఫొటో షేర్ చేసిన శ్రీలీల.. ఓ మై గాడ్ అది అస్సలు ఊహించలేదు అని అంటున్న నెటిజన్లు

పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-03-28 08:34 GMT
నువ్వే నా జీవితం అంటూ అతనితో క్యూట్ ఫొటో షేర్ చేసిన శ్రీలీల.. ఓ మై గాడ్ అది అస్సలు ఊహించలేదు అని అంటున్న నెటిజన్లు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

రీసెంట్ సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పుష్ప-2(Pushpa-2) మూవీలో శ్రీలీల ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది. ఆ బ్యూటీ డాన్స్‌కి ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. నితిన్(Nithin) సరసన ‘రాబిన్ హుడ్’(Robbin Hood), రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది.

అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన పై చదువులు పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

అందులో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌(Karthik Aryan)తో టీ తాగుతున్న ఫొటోను షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ అలిగి ఉంటే.. అతను బుజ్జగిజ్జస్తున్నాడు. ఇక ఈ పిక్‌కు ‘నువ్వే నా జీవితం’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఓ మై గాడ్ అది అసలు ఊహించలేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News