బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ పూర్తి.. విష్ణు ప్రియ ఆసక్తికర పోస్ట్ వైరల్
గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, సినిమా: గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ యాప్స్‌కు సపోర్ట్ చేసి ప్రమోట్ చేసిన వారిలో ఇన్ల్ఫూయెన్సర్స్‌తో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే యాప్స్‌కు ప్రమోట్ చేసిన వారిపై కేసులు కూడా నమోదు కావడంతో పాటు విచారణకు కూడా పిలిపించారు. అయితే ఇందులో ప్రముఖ యాంకర్స్ రితూ చౌదరి(Rithu Chaudhary), విష్ణుప్రియ కూడా ఉన్నట్లు సమాచారం. నిన్నటికి నిన్న వీరిద్దరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. ఎవరికి తెలియకుండా ముఖమంతా స్కార్ఫ్ కట్టుకుని వెళ్లినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే వీరిని కొన్ని గంటలపాటు విచారించినట్లు టాక్. అయితే విష్ణుప్రియకు సంబంధించిన 15 వీడియోలు పోలీసులు దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి దగ్గర విష్ణుప్రియ(Vishnupriya) సైలెంట్‌గా ఉండి ఎవరికి కనిపించకుండా ఇంటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. అప్పటివరకు ఓర్పుతో ఉండటమే మంచిది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే ఎల్లో కలర్ హార్ట్ సింబల్స్‌ను కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేసింది నిజమే విచారణను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
