కుంభమేళాకు వెళ్లిన బాలయ్య బ్యూటీ.. మెడలో ఆ మాలతో కనిపించడంతో అంతా షాక్.. పోస్ట్ వైరల్

ఎక్కడ చూసినా కుంభమేళా గురించే చర్చించుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు.

Update: 2025-02-11 04:34 GMT

దిశ, సినిమా: ఎక్కడ చూసినా కుంభమేళా గురించే చర్చించుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైన ఈ వేడుక ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. కేవలం సామాన్యులే కాదు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా మహా కుంభమేళాలో భాగమవుతున్నారు. ప్రధానంగా సినీ తారలు పెద్ద ఎత్తున కుంభమేళా వేడుకలో భాగమవుతున్నారు.

అయితే ఇప్పటికే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), యాంకర్ లాస్య, బిందుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, సంయుక్త మీనన్(Samyuktha Menon), పవిత్ర గౌడ,హేమ మాలినీ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్య వంశీ, రాజ్ కుమార్ రావు తదితర సినీ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ సోనాల్ చౌహాన్(Sonal Chauhan) మహాకుంభమేళాను దర్శించుకుంది. సంప్రదాయ దుస్తులు ధరించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవి కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. అయితే ఆమె మెడలో మాలకు సంబంధించిన దండ కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు.

కాగా, సోనాల్ చౌహాన్ రెయిన్ బో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అమ్మడు లెజెండ్(Legend), డిక్టేటర్(Dictator), రూలర్ మూవీల్లో బాలకృష్ణ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే పండగ చేస్కో, షేర్, ఎఫ్3, ది ఘోస్ట్, ఆది పురుష్ వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలో నటించి మెప్పించింది. అయినప్పటికీ పెద్ద అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

Tags:    

Similar News