వైసీపీ అరాచకాలపై గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం అరాచక విధానాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 14 పేజీల సుదీర్ఘ లేఖను అందజేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు బీసీ సామాజిక వర్గ మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టారని వివరించారు. అంతాకాకుండా ఏడాది పాలనలో 33మంది ప్రజాప్రతినిధులపై కేసులు […]
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం అరాచక విధానాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 14 పేజీల సుదీర్ఘ లేఖను అందజేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ముగ్గురు బీసీ సామాజిక వర్గ మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టారని వివరించారు. అంతాకాకుండా ఏడాది పాలనలో 33మంది ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టారనీ, 800మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించారని లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు అవినీతి కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.