Breaking: పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఒకరు మృతి
అనంతపురం జిల్లా యాడికి పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ(Penna Cement Factory)లో ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా యాడికి(Anantapur District Yadiki) మండలం పరిధిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వ్యక్తి మృతిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.