Anil Kumar: పోలీస్ కస్టడీలో సంచలన ఆధారాలు
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు అనంతపురంలో పోలీసు కస్టడీ పూర్తి అయింది...
దిశ, వెబ్ డెస్క్: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్(Borugadda Anil Kumar) అనంతపురం(Anantapur)లో పోలీసు కస్టడీ(Police Custody) పూర్తి అయింది. సోషల్ మీడియా(Social Media)లో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో కోర్టు అనుమతితో ఆయన్ను సోమవారం ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. అనిల్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చి అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్(Anantapur Fourth Town Police Station)లో ప్రశ్నించారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా అనిల్‌ను విచారించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు స్వయంగా పెట్టారా..?, ఎవరి ప్రోద్బలమైనా ఉందా అనే కోణంలో ప్రశ్నలు సంధించారు. మూడో రోజు కస్టడీ ముగియడంతో బోరుగడ్డ అనిల్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. ధర్మాసనం ఆదేశాలతో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు.
కాగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను, అలాగే జడ్జిలపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఆదేశించింది.