రజినీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్పెషల్ బర్త్ డే విషెస్
అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) 74వ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) 74వ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. సినీ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా(X) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్, ఎంతోమందికి తన అడుగే ఒక ఇన్స్పిరేషన్‌గా నిలిచి చిత్రసీమలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సువర్ణ అక్షరాలతో లిఖింపబడేలా కష్టపడిన నటుడు @rajinikanth గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సూపర్ స్టార్, ఎంతోమందికి తన అడుగే ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచి చిత్ర సీమలో తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సువర్ణ అక్షరాలతో లిఖింపబడేలా కష్టపడ్డ నటుడు @rajinikanth గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdaySuperstar#HBDRajinikanth#Coolie pic.twitter.com/sQvYR2FsUU
— Nandamuri Balakrishna (@NBK_Unofficial) December 12, 2024