‘విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి’.. APUWJ డిమాండ్
ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్ లో కవరేజ కోసం వెళ్లిన ఓ మీడియా విలేకరి పై మిగతా విలేకరులపై లోగో తో దాడి చేయడం సిగ్గుచేటని ఏపియుడబ్ల్యూజె జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, తాలూకా అధ్యక్షులు వగరూరు జయరాజ్, ప్రధాన కార్యదర్శి కె హుశేని, కోశాధికారి షాబువలి లు ఖండించారు.
దిశ, మంత్రాలయం: ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్ లో కవరేజ్ కోసం వెళ్లిన ఓ మీడియా విలేకరి పై, మిగతా విలేకరులపై లోగోతో దాడి చేయడం సిగ్గుచేటని ఏపియుడబ్ల్యూజె జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, తాలూకా అధ్యక్షులు వగరూరు జయరాజ్, ప్రధాన కార్యదర్శి కె హుశేని, కోశాధికారి షాబువలి లు ఖండించారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్ లో ఏపియుడబ్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా, చేపట్టారు. ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జి.కే గురురాజరావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విలేకరులపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. సినీ పరిశ్రమలో మోహన్ బాబు ఎదుగుదలకు దోహదపడిన మీడియా పైనే దాడి చేయడం తగదని అన్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేసి గాయపడిన రంజిత్ కు మెరుగైన వైద్యం అందించి బాధిత విలేకరుల ను ఆదుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపియుడబ్ల్యూజె ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపియుడబ్ల్యూజె మండల గౌరవాధ్యక్షులు రానోజీ రావు, అధ్యక్షులు భీమ రాయ, కార్యదర్శి వెంకట్, కోశాధికారి రఫీ, రామస్వామి, వెంకటేష్, కంతం నరసింహులు, నాగరాజు, వీరేష్, చిదానంద, మున్న తదితరులు పాల్గొన్నారు.