CM Chandrababu:సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ సబ్ కమిటీ

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) సోషల్ మీడియా(Social Media)లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Update: 2024-12-12 14:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) సోషల్ మీడియా(Social Media)లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేడు(గురువారం) రెండో రోజు కలెక్టర్ల సదస్సు(Collector Conference)లో సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియా పోస్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులతో ఇబ్బందులకు గురిచేసిన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా పోస్టులపై కేబినెట్ సబ్ కమిటీ పై సీఎం చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ‘కొందరు నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారు. వీటిపై నియంత్రణకు ఓ కమిటీని నియమించాలి. మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, అనిత, సత్యకుమార్ యాదవ్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేలా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.


Similar News