Road Accident:విషాదం.. టిప్పర్ ఢీకొని మహిళ మృతి

ధర్మవరం టౌన్ కళాజ్యోతి సర్కిల్ మలుపు వద్ద ధర్మవరం RTC బస్టాండ్ వైపు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వైపుకు వెళ్లే టిప్పర్ లారీ టు వీలర్‌ను ఢీ కొట్టడంతో మహిళ మృతి చెందింది.

Update: 2024-12-12 11:50 GMT

దిశ ప్రతినిధి, ధర్మవరం: ధర్మవరం టౌన్ కళాజ్యోతి సర్కిల్ మలుపు వద్ద ధర్మవరం RTC బస్టాండ్ వైపు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వైపుకు వెళ్లే టిప్పర్ లారీ టు వీలర్‌ను ఢీ కొట్టడంతో మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం దొడ్డబల్లాపూర్‌ కు చెందిన నాగమణి (46 ) ఆమె భర్త సోమశేఖర్ దంపతులు శుభకార్యం కోసం దొడ్డబల్లాపురం నుంచి ధర్మవరంలో ఇందిరమ్మ కాలనీకి వచ్చారు. కాలనీ నుంచి TVS XL టూవీలర్ లో ధర్మవరం టౌన్ తొగట వీధికి వస్తూ ఉండగా, ధర్మవరం టౌన్ కళాజ్యోతి సర్కిల్ మలుపు వద్ద ధర్మవరం RTC బస్టాండ్ వైపు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వైపు వెళ్లే ఒక లారీ టూ వీలర్ పై వెళుతున్న నాగమణి, సోమశేఖర్ దంపతులను ఢీ కొట్టింది. ఈ క్రమంలో నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. సోమశేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం నాగమణిని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.


Similar News