Lady Don Arrest: మోస్టు వాంటెండ్ ధూల్ పేట్ లేడీ డాన్ అరెస్టు
మోస్టు వాంటెండ్ ధూల్ పేట్ లేడీ డాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
దిశ, సిటీ క్రైం/డైనమిక్ బ్యూరో: మోస్టు వాటెండ్ గంజాయి డాన్ అంగూర్ బాయ్ (Angur bai) ను పోలీసులు అరెస్టు చేశారు. ధూల్‌పేట్‌లో (Dhool Pate) గంజాయిని హోల్‌సేల్, రిటేల్ అమ్మకాల్లో అరితేరిన అంగూర్ బాయ్ ఆ ప్రాంతంలో గంజాయి డాన్‌గా పేరుంది. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఆమె పోలీసులకు దొరక్కుండా కళ్లుగప్పితిరుగుతోంది. ఈ క్రమంలో అపరేషన్ ధూల్‌పేట్‌లో (Operation Dhool Pate) భాగంగా ఇవాళ కార్వాన్ ప్రాంతంలో ఆమెను ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, గంజాయి అమ్మకాల్లో రూ.కోట్లకు పడుగలెత్తిన అంగూర్ బాయ్‌పై ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో 3, మంగళ్‌హట్ పీఎస్‌లో 4, ఆసిఫ్‌నగర్, గౌరారం స్టేషన్లలో 10 కేసుల్లో ముద్దాయిగా ఉన్నది.