Ponnam: ముగిసిన ఓరియెంటేషన్ క్లాసులు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) ప్రజా సమస్యలపై చర్చకు వేదిక కావాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) ప్రజా సమస్యలపై చర్చకు వేదిక కావాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ, మండలి శీతాకాలం సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో శాసన సభ, మండలి సభ్యులకు శాసన సభ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఓరియెంటేషన్ తరగతులు(Orientation Classes) నిర్వహించారు. నేటితో ఈ ఓరియెంటేషన్ క్లాసులు ముగిశాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మూడవ శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు(MLAs), ఎమ్మెల్సీలకు(MLCs) తెలంగాణ ప్రభుత్వం(telangana Government) శాసన సభ వ్యవహారాల శాఖ రెండు రోజుల పాటు ఒరియంటేషన్ క్లాస్ లు నిర్వహించడం జరిగిందన్నారు.
మర్రి చెన్నారెడ్డి(Marri Chennareddy) మానవ వనరుల వేదికగా వివిధ అంశాలపై అవగాహన నిర్వహించడం జరిగిందని, సభలో వివిధ ప్రజా అంశాలు చర్చకు రావాలని, సభ విలువలు కాపాడాలని, ప్రజాస్వామ్య అంశాలు చర్చకు రావాలని అన్నారు. శాసన సభ, శాసన మండలిలో సమర్థవంతంగా ప్రజల అంశాలు చర్చకు రావాలని కోరుకున్నారు. ఏ ఉద్దేశ్యంతో ప్రజల కోసం ప్రభుత్వాలు ఎన్నికయ్యాయో అది నెరవేరే విధంగా సభ్యులందరూ సభ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ అవగాహన శిక్షణ తరగతులు జరిగాయన్నారు. ప్రజాస్వామ్య విలువలకు వేదిక శాసన సభ అని, భవిష్యత్ లో ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, శాసన సభ, శాసన మండలి ప్రజా సమస్యలపై చర్చకు వేదిక కావాలని మంత్రి పొన్నం ఆశించారు.