Bandi Sudhakar: కళ్లుండి చూడలేని కబోది కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఏడాది పాలనలో విజయవంతంగా ముందుకెళుతుంటే.. ఓర్వలేకనే రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశాడని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు.

Update: 2024-12-12 17:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఏడాది పాలనలో విజయవంతంగా ముందుకెళుతుంటే.. ఓర్వలేకనే రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశాడని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. కళ్లుండి చూడలేని కబోది కేటీఆర్ అని ఆయన దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసిందని.. ఇదంతా చూస్తూ కూడా రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ ఎలా రాస్తారని సుధాకర్ గౌడ్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేటీఆర్ నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. ఉచిత బస్సు ప్రయాణంలో 80 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారని గుర్తుచేశారు. రూ.21 వేల కోట్లతో రుణమాఫీ చేసింది నిజం కాదా? అన్నారు. దమ్ముంటే హామీలు అమలు చేయట్లేదని కేటీఆర్ నిరూపించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News