Minister Seethakka: కష్టాన్ని ఇష్టంతో చేస్తే మంచి ఫలితాలు
వన్ కార్పొరేట్.. వన్ విలేజ్ అడాప్షన్ గొప్ప నిర్ణయమని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వన్ కార్పొరేట్.. వన్ విలేజ్ అడాప్షన్ గొప్ప నిర్ణయమని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్ - సోషల్ ఇంపాక్ట్ కాన్ క్లేవ్ 4.O కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కల్పిస్తున్న నిర్మాణ్ సంస్థ కార్పొరేట్లకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తుందన్నారు. కష్టాన్ని ఇష్టంతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయనడానికి నిర్మాణ్ సంస్థ నిదర్శనమన్నారు. మారుమూల ప్రాంతాల్లోని పరిస్థితులను గ్రామీణ బస్సు యాత్ర ద్వారా కార్పొరేట్లకు చూపించగలరన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయన్నారు.
మీరు గ్రామాల్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలి. మీ బాటలో ఎంతోమంది ముందుకు వచ్చి గ్రామాలను దత్తత తీసుకుంటారన్నారు. ప్రజల అభివృద్ధి కోసం మనసున్న మార్గం తెలియదు ఆ మార్గాన్ని ప్రభుత్వ ప్రతినిధులుగా మేము చూపిస్తామని, అట్టడుగు ప్రజల అవసరాలు తీర్చేలా నిబద్దతతో పని చేయాలన్నారు. మహిళా సాధికారత కోసం 17 రకాల వ్యాపారల్లో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని, కుటుంబంలో తల్లి బాగుంటేనే కుటుంబం బాగుంటుందన్నారు. 64 లక్షల మంది సభ్యులుగా ఉన్న మహిళా బృందాలను కోటి మందికి చేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో సాంకేతిక వెనకబాటు ను రూపుమాపే దిశలో ఐటి సంస్థలు పని చేయాలని సూచించారు. గ్రామాల్లో మార్పు చేసి చూపించాలి మార్పు ఆకాంక్షిస్తున్న సంస్థలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలిపారు.