Kishan Reddy: గుకేశ్ విజయం దేశ యువతకు స్పూర్తి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఒత్తిడిలో సాధించిన విజయం ఈ దేశ యువతకు స్పూర్తి అని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు.

Update: 2024-12-12 17:19 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒత్తిడిలో సాధించిన విజయం ఈ దేశ యువతకు స్పూర్తి అని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. ప్రపంచ చెస్ చాంపియన్(World Chess Champion) గా తమిళనాడుకు చెందిన గుకేశ్(Gukesh Dommaraju) ఘనత సాధించారు. దీనిపై కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజుకి హృదయపూర్వక శుభాకాంక్షలు(Congratulations) తెలిపారు. అలాగే అతిచిన్న వయసులో ప్రపంచచాంపియన్‌గా అవతరించి సరికొత్త రికార్డును మీ పేర రాసుకోవడం.. యావత్ భారతానికి గర్వకారణమని అన్నారు. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు జరిగిన టైటిల్ పోరులో.. తీవ్రమైన ఒత్తిడిలోనూ గుకేశ్ సాధించిన ఈ విజయం.. దేశ యువతకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు. అంతేగాక భవిష్యత్తులోనూ గుకేశ్ ఇలాంటి మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని, అంతర్జాతీయ క్రీడావేదికలపై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News