Breaking News : నలుగురు కలెక్టర్లకు తెలంగాణ హైకోర్ట్ నోటీసులు
రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్ల(Collectors)కు తెలంగాణ హైకోర్ట్(Telangana High Court) నోటీసులు జారీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్ల(Collectors)కు తెలంగాణ హైకోర్ట్(Telangana High Court) నోటీసులు జారీ చేసింది. రైతుల ఆత్మహత్యాలపై దాఖలైన పిల్(PIL) పై స్పందించిన కోర్ట్.. ఆయా జిల్లా కలెక్టర్లకు నోటీసులు పంపింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు 4 నెలల్లో పరిహారం ఇస్తామని చెప్పి.. ఏడాది దాటినా బాధితులకు పరిహారం అందించకపోవడంపై కొండల్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో ప్రజా ప్రాయోజిత వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్ట్.. యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, అదిలాబాద్ కలెక్టర్లకు తాఖీదులు పంపింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఎందుకు స్వీకరించకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.