TG Govt: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్ ఇచ్చిన పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల(Indiramma illu)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) బిగ్ అప్డేట్ ఇచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల(Indiramma illu)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) బిగ్ అప్డేట్ ఇచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన(Praja Palana)లో దరఖాస్తు చేసుకోని వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు చేర్చినట్లు చెప్పారు. సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 2.32 లక్షల దరఖాస్తులను యాప్‌లో నమోదు చేసినట్లు చెప్పారు.
కాస్త ఆలస్యమైనా అర్హత కలిగిన లబ్ధిదారులు అందరికీ ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. సంక్రాంతి పండుగలోపు మళ్లీ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.