Breaking News : రెండస్తుల బిల్డింగ్ పై నుండి పడిన విద్యార్థి... త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఓ విద్యార్థి కొద్దిలో ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు.
దిశ, వెబ్ డెస్క్ : ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఓ విద్యార్థి కొద్దిలో ప్రాణగండం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్(Secundrabad) పరిధిలోని పల్లవి మోడల్ స్కూల్(Pallavi Model School)లో చదువుతున్న చిన్నారి అనుకోకుండా పాఠశాల బిల్డింగ్ లోని రెండవ అంతస్తు నుంచి కింద పడ్డాడు. అయితే ఆ విద్యార్థి నేరుగా కింద పడకుండా.. సరిగ్గా కింద ఆవరణలో నడుచుకుంటూ వెళ్తున్న మరో విద్యార్థిపై పడ్డాడు. దీంతో కొద్దిపాటి గాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. కాగా వెంటనే పాఠశాల యాజమన్యం దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో విద్యార్థిని జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.