Rachakonda CP : జర్నలిస్ట్ పై దాడి కేసులో విచారణ జరుగుతోంది : రాచకొండ సీపీ
రెండు రోజుల క్రితం నటుడు తన ఇంటివద్ద పలువురు మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు(MohanBabu) దాడి చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజుల క్రితం నటుడు తన ఇంటివద్ద పలువురు మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు(MohanBabu) దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP SudheerBabu) మీడియాకు వివరాలు ప్రకటించారు. రంజిత్ పై దాడి కేసులో విచారణ జరుగుతోందని, స్టేట్‌మెంట్ తీసుకుని తదుపరి విచారణ చేస్తామని పేర్కొన్నారు. మోహన్‌బాబు, విష్ణు(Vishnu)ను గన్స్ సరెండర్ చేయాలని ఆదేశించామని, కాగా అవి లాకర్‌లో ఉన్నాయని, త్వరలోనే సరెండర్ చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. శాంతి యుతంగా ఉంటానని మనోజ్(Manoj), విష్ణు బాండ్ ఇచ్చారని.. ఇక వారి కుటుంబ గొడవను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని రాత పూర్వకంగా హామీ ఇచ్చినట్టు సీపీ వెల్లడించారు.