Mohan Babu: ‘ఎందుకు దాడి చేశానో అర్థం చేసుకోండి’.. మోహన్ బాబు వివరణ

జర్నలిస్టులపై దాడి ఘటనపై నటుడు మోహన్ బాబు(Mohan Babu) స్పందించారు. గురువారం ఓ మీడియా చానల్ ప్రతినిధితో మాట్లాడి వివరణ ఇచ్చారు.

Update: 2024-12-12 13:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టులపై దాడి ఘటనపై నటుడు మోహన్ బాబు(Mohan Babu) స్పందించారు. గురువారం ఓ మీడియా చానల్ ప్రతినిధితో మాట్లాడి వివరణ ఇచ్చారు. ఘటనపై చింతిస్తున్నట్లు తెలిపారు. ‘నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతకు భంగం కలిగించారు. అందుకే కోపం వచ్చి దాడి చేశాను. నా దగ్గరకు వచ్చింది ఏ చానల్ రిపోర్టర్(Journalist) అనేది కూడా చూడలేదు. అసలు రిపోర్టరేనా? మరెవరైనా వచ్చారా? అనేది కూడా తెలియదు’ అని మోహన్ బుబు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. అంతకుముందు మోహన్ బాబుకు సంబంధించిన మరో ఆడియో క్లిప్ వైరల్‌ అయింది. ‘ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా.? ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలి. ఇలా మీడియాపై దాడి చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నేనెంత ఆవేదనకు గురయ్యానో మీరు అర్థం చేసుకోవాలి. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు. దాడి చేయడం తప్పే.. నా పరిస్థితి.. సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. జరిగిన ఘటనకు బాధపడుతున్నాను’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు.

Tags:    

Similar News