Nayanatara : నయనతారకు హైకోర్ట్ నోటీసులు
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara)కు చెన్నై హైకోర్టు(Chennai High Court) షాకిచ్చింది.
దిశ, వెబ్ డెస్క్ : లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara)కు చెన్నై హైకోర్టు(Chennai High Court) షాకిచ్చింది. హీరో ధనుష్(Dhanush) వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు నయతారకు నోటీసులు జారీ చేసింది. ఇటీవల నయనతార జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్(Netflix).. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’(Nayanatara : Bryond The Fairy Tale) అనే డాక్యుమెంటరీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ధనుష్ నిర్మాతగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi)-నయనతార కాంబినేషన్ లో దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh Shivan) తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీలోని కొన్ని సన్నివేశాలను ఉపయోగించారు. తన పర్మిషన్ లేకుండా తన మూవీలోని సీన్స్ ను ఎలా వాడుతారంటూ ధనుష్ మద్రాస్ హైకోర్టులో రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. జనవరి 8వ తేదీ లోపు దీనిపై వివరణ ఇవ్వాలని నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్, నెట్‌ఫ్లిక్స్ ను కోర్టు ఆదేశించింది.