Johny Master : బ్యాక్ టు డాన్స్ అంటున్న జానీ మాష్టర్
లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johny Master) మళ్లీ సినిమా షూటింగ్‌ల్లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
దిశ, వెబ్ డెస్క్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johny Master) మళ్లీ సినిమా షూటింగ్‌ల్లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాక్ టూ ది బీట్స్ ఇన్ ఫుల్ వాల్యూమ్ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో జానీ మాస్టర్ తన డాన్స్ స్టూడియోకి వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో జానీ మళ్లీ సినిమాల్లో కొరియోగ్రాఫీ చేయనున్నట్లు హింట్ ఇచ్చాడు.