లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు
ఛత్తీస్గడ్ సుక్మా ప్రాంతంలో క్రియా శీలకంగా ఉన్న 11 మంది మావోయిస్టులు సుక్మా ఎస్పీ కార్యాలయంలో సీఆర్పీఎఫ్ సెకండ్ కమాండెంట్ అమిత్ ప్రకాష్, డిప్యూటీ కమాండెంట్ రవి గన్వీర్ ల ఆధ్వర్యంలో లొంగిపోయారు.
దిశ, భద్రాచలం : ఛత్తీస్గడ్ సుక్మా ప్రాంతంలో క్రియా శీలకంగా ఉన్న 11 మంది మావోయిస్టులు సుక్మా ఎస్పీ కార్యాలయంలో సీఆర్పీఎఫ్ సెకండ్ కమాండెంట్ అమిత్ ప్రకాష్, డిప్యూటీ కమాండెంట్ రవి గన్వీర్ ల ఆధ్వర్యంలో లొంగిపోయారు. ప్రభుత్వం అవలంబిస్తున్న నక్షలిజం నిర్మూలన పునరావాస విధానంకు ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో జోగేంద్ర యాదవ్, హేమ్లా దేవ, మద్వి గంగ, మడకం నగ్న, మడకం ముకేశ్, హేమ్లా జోగా, బార్సె లకమా, సోడి ముక్కా, మడకం హంగా, మద్వి పోజ్జా, హేమ్లా సుక్క ఉన్నారు. వీరికి ప్రభుత్వం తరపున సాయం అందించనున్నట్టు పేర్కొన్నారు.