Minister Kandula Durgesh:ఈ నెల 17న పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు.. కీలక అంశాలపై చర్చ

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

Update: 2024-12-12 12:10 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల(డిసెంబర్) 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సదస్సులో నూతన పర్యాటక పాలసీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) విధానంలో ఎలా ముందుకెళ్లాలనే అంశాలను కూలంకషంగా చర్చిస్తామని కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. అడిగిన వెంటనే పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) పరిశ్రమ హోదా కల్పించారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Tags:    

Similar News