పోటీ పడుతూ పనిచేస్తేనే పెట్టుబడులు పెరుగుతాయి.. నారా లోకేష్

ఏపీలో పారిశ్రామీక రంగంలో (Industrial sector) రాణించాలంటే స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో ముందుండాలని ఐటీ పరిశ్రమల మంత్రి నారా లోకేష్ (IT Industries Minister Nara Lokesh) సూచించారు.

Update: 2024-12-12 11:21 GMT

దిశ, వెబ్ డెస్క్; ఏపీలో పారిశ్రామీక రంగంలో (Industrial sector) రాణించాలంటే స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో ముందుండాలని ఐటీ పరిశ్రమల మంత్రి నారా లోకేష్ (IT Industries Minister Nara Lokesh) సూచించారు. వెలగపుడిలోని సచివాలయంలో రెండో రోజు జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోటీ పడుతూ పనిచేస్తేనే పెట్టుబడులు పెరుగుతాయని అన్నారు. ఐటీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాడానికి అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోకి వచ్చే పెద్ద పెద్ద పెట్టుబడులను, పరిశ్రమల ప్రతిపాదనలపై వారు సచివాలయం నుండి పర్యవేక్షిస్తుంటామని లోకేష్ అన్నారు. జిల్లాలో ఎంఎస్ఎంఈ (MSME) రంగంలో స్థాపించే చిన్న చిన్న పెట్టు బడులకు అనుమతుల్లో జాప్యం చేయొద్దు అంటూ కలెక్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తద్వారా పరిశ్రమలో 20 లక్షల ఉద్యోగాల (20 lakh jobs) కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఎంఎ స్ఎంఈ రంగంలో 80 శాతం ఉద్యోగాలు కల్పించవచ్చని వెల్లడించారు.

Tags:    

Similar News