AP Rains:రాష్ట్రంలో భారీ వర్షాలు.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తిరుపతి జిల్లాలోని తిరుమల, సూళ్లూరుపేట ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rain) నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఘాట్ రోడ్లలో ప్రయాణించే శ్రీవారి భక్తులు(Devotees) సహా వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల ప్రజలు, అధికారులను అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.
అయితే.. ఉధృతంగా వరదనీరు(Floods) ప్రవహిస్తోన్న లక్ష్మీపురం కూడలి, గొల్లవాని గుంట లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు(Protective measures) చేపట్టాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులను ఫోన్ కాల్స్(Phone Calls) ద్వారా హెచ్చరికలు పంపి అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖను హోం మంత్రి ఆదేశించారు. తిరుపతిలో మార్వాడి గుండం జలపాతం ఉధృతంగా ప్రవహించడం సహా తిరుపతి జిల్లాలోని సూళ్ళూరు, కాళంగి గేట్లు ఎత్తివేత నేపథ్యంలో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత(Home Minister Anitha) సూచించారు.