AP News:ఫారెస్ట్ ప్రాంతాల్లో గ్యాంబ్లింగ్ పై ప్రత్యేక నిఘా!
బహిరంగంగా మద్యం సేవించడం, గ్యాంబ్లింగ్, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి వినియోగించిన వారిపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టే విధంగా శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ శ్రీకారం చుట్టారు.
దిశ ప్రతినిధి, పుట్టపర్తి: బహిరంగంగా మద్యం సేవించడం, గ్యాంబ్లింగ్, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి వినియోగించిన వారిపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టే విధంగా శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ శ్రీకారం చుట్టారు. ఆదివారం పుట్టపర్తి ఫారెస్ట్ సమీప ప్రాంతాలైన ఆమగొండపాలెం, కంబలపర్తి పరిసరాల నిర్మానుష్యమైన ప్రాంతాలతో పాటు ఆయా పరిసర ప్రదేశాల్లో, తోటలు పై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం,పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ,ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ ఇతర నేరాలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో పుట్టపర్తి సమీప ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.