భయం అనేది జగన్ బ్లడ్‌లోనే లేదు: రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

భయం అనేది జగన్ బ్లడ్‌లోనే లేదని మాజీ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు...

Update: 2024-12-18 15:26 GMT

దిశ, వెబ్ డెస్క్: భయం అనేది ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former AP CM Jagan Mohan Reddy) బ్లడ్‌లోనే లేదని మాజీ మంత్రి రోజా(Former minister Roja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ వెనుక నడుస్తున్న తాము కూడా ఎవరికీ భయపడమని ఆమె చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నాయకులు దాడులు చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యకం చేశారు. తమ పార్టీ నేతలు ఎవరూ తప్పు చేయలేదని, మోసాలు, EVM టాంపరింగ్‌లతో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ 6 అంటూ జనాలను మోసం చేసిన వాళ్ళు సిగ్గుపడాలన్నారు. ఆరునెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు మాత్రమేనని చెప్పారు. కూటమి ప్రభుత్వ హనీమూన్‌ కాలం అయిపోయందని హెచ్చరించారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న కూటమిని అందరం ఒక్కటై ఎదుర్కుంటామన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా పని చేస్తే హెరాస్‌మెంట్‌ కేసులు వేయడం ఖాయమన్నారు. వైసీపీ నాయకులందరం నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. 

Tags:    

Similar News