AP: కెనడాలో విశాఖ జిల్లా వాసి మృతి

కెనడాలో విశాఖ జిల్లా వాసి మృతి చెందారు...

Update: 2024-12-18 14:42 GMT

దిశ, వెబ్ డెస్క్: కెనడా(Canada)లో విశాఖ జిల్లా వాసి మృతి చెందారు. విశాఖ జిల్లా గాజువాక(Gajuwaka)కు చెందిన ఫణికుమార్.. ఎంఎస్ చేసేందుకు ఇటీవల కాలంలో కెనడా వెళ్లారు. రోజూ మాదిరిగా కాలేజీ నుంచి తన గదికి వచ్చి నిద్రపోయారు. అయితే ఉదయం అయినా ఫణికుమార్ ఎంతకీ లెగవలేదు. వెంటనే ఫణికుమార్‌ను తోటి స్నేహితులు కదిలించి చూశారు. కానీ చలనం లేదు. దీంతో ఫణి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఫణికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా కనిపించే ఫణి ఇకలేరని తెలిసి తోటి స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఫణికుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేలా సాయం చేయాలని విశాఖ ఎంపీ భరత్, కలెక్టర్‌ను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఉన్నత చదవుల కోసం వెళ్లి కెనడాలో ప్రాణాలు కోల్పోవడంతో అటు గాజువాకలోనూ విషాద చాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News