Ap News:సిమెంట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు

సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని తిరుపతి జిల్లా డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్ హెచ్చరించారు.

Update: 2024-12-18 15:00 GMT

దిశ, శ్రీకాళహస్తి: సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిన ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని తిరుపతి జిల్లా డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం ఆయన ఏర్పేడు మండలం లోని పాత వీరాపురంలో జరుగుతున్న సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల నాణ్యతను పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడవద్దని సిబ్బందికి సూచించారు. పనులు పూర్తయిన వారం రోజుల్లో బిల్లులను చెల్లిస్తున్నామని, ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

1.75 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్ల నిర్మాణాలు ప్రారంభం కావాల్సి ఉండగా, 32 పనులు ప్రారంభం కాకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. పనులను ఎందుకు ప్రారంభించలేదో వెంటనే వివరణ ఇవ్వాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. అందుకు సంబంధించిన వారిని గుర్తించినట్లు తెలిపారు. సిమెంట్ రోడ్ల తనిఖీలో అదనపు పిడి చంద్రశేఖర్ రాజు, ఏఈ రవితేజ, జూనియర్ ఇంజనీర్ బాలాజీ తదితరులు కూడా పాల్గొన్నారు.


Similar News