Tirupati: బీసీ భవన నిర్మాణాలపై మంత్రి సవిత కీలక ప్రకటన
రాష్టవ్యాప్తంగా 26 జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామని మంత్రి సవిత తెలిపారు..
దిశ, వెబ్ డెస్క్: రాష్టవ్యాప్తంగా 26 జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మిస్తామని మంత్రి(Minister Savita) సవిత తెలిపారు. తిరుపతి(Tirupati)లో బీసీ బాలిక హాస్టల్(BC Girls Hostel)ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం(TDP Government) బీసీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆ భవనాలన్నీ 70 నుంచి 80 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అయితే ఆ తరవాత వచ్చిన వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వం ఆ నిర్మాణాలను పట్టించుకోలేదని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతులు నిధులు మంజూరు చేయలేదని మండిపడ్డారు. చివరికి విద్యార్థుల డైట్ బిల్లులు కూడా చెల్లించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగుల రెడ్డికి భవనాలకు రంగుల వేయడంపై ఉన్న శ్రద్ధ హాస్టళ్ల నిర్వహణపై చూపలేదని మంత్రి విమర్శించారు. హాస్టల్ భవనాలకు రంగు మార్చో...పేరు మార్చో...నిర్మాణాలు పూర్తి చేసి ఉంటే బీసీ విద్యార్థులకు ఎంతో మేలు జరిగేదని చెప్పారు. బీసీ ద్రోహిగా జగన్ చరిత్రలో నిలిచిపోయారని మంత్రి సవిత విమర్శించారు. గత ప్రభుత్వం వల్ల అసంపూర్తిగా నిలిచిపోయిన అన్ని బీసీ భవనాలను పూర్తి చేస్తామన్నారు. అలాగే కొత్త జిల్లాల్లోనూ నూతన భవనాలు నిర్మిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు.