రేపు పోలవరానికి సీఎం చంద్రబాబు.. నిర్మాణ పనుల పరిశీలన

పోలవరానికి సీఎం చంద్రబాబు సోమవారం వెళ్లనున్నారు...

Update: 2024-12-15 11:00 GMT

దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) దృష్టి సారించారు. నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పోలవరం పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రాజెక్టును జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu)తో కలిసి సోమవారం సందర్శించనున్నారు. ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ విభాగం అధికారులతో భేటీ అవుతారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రం వాల్ పనులపై ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇటీవలే రూ.15 వేల కోట్ల నిధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పర్యటనకు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Tags:    

Similar News