TDP: టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక
కూటమి ప్రభుత్వం(NDA Govt) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాల్లో(Politics) జంపింగ్ ల పర్వం కొనసాగుతోంది.
దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం(NDA Govt) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ రాజకీయాల్లో(Politics) జంపింగ్ ల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షంలోని నేతలు(Opposition Leaders) ఒక్కొక్కరుగా అధికార పక్షం వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీ(YSRCP)లో కీలకంగా వ్యవహరించిన ఓ నేత టీడీపీ(TDP)లోకి చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్(AP) మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు(Eluru) మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని(Alla Nani) (కాళీకృష్ణ శ్రీనివాస్) ఇవాళ టీడీపీ అధినేత సమక్షంలో పార్టీలో జాయిన్ కాబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ(AP Cabinet Meeting) జరగనున్న విషయం తెలిసిందే.
దీని అనంతరం సీఎం చంద్రబాబు(CM Chandrabau) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆళ్ల నాని దీనికి సంబంధించి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు ఇప్పటికే తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో డిస్కషన్ కూడా జరిగినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆళ్ల నాని వెంట వైసీపీ నేతలు మరి కొందరు కూడా పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పటికే పార్టీ ఓడిపోయి, కేడర్ తగ్గిపోయి.. పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు కూడా ఒక్కొక్కరుగా పార్టీని వీడటం మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan Mohan Reddy) కు పెద్ద దెబ్బ తగిలినట్లు అవుతుంది. కాగా ఆళ్ల నాని గత ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.