తిరుపతిలో భారీగా ఎర్రచందనం పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
తిరుపతిలో ఎర్రచందనం తరలింపు పై పోలీసులు ఎంత నిఘాపెట్టినా దుండగలు మాత్రం రెచ్చిపోతున్నారు..
దిశ, వెబ్ డెస్క్: ఎర్రచందనం(Red Sandalwood) తరలింపుపై పోలీసులు ఎంత నిఘాపెట్టినా దుండగలు మాత్రం రెచ్చిపోతున్నారు. శేషాచలం అడవుల(Seshachalam Forest) నుంచి కోట్ల విలువైన ఎర్ర చందనాన్ని తరలించుకుపోతున్నారు. పోలీసులు రైడ్ చేస్తే కొన్ని సమయాల్లో దొరికిపోతున్నారు. మరికొన్ని సందర్భాల్లో తప్పించుకని పారిపోతున్నారు. తాజాగా జరిగిన ఘటనలో ఇదే జరిగింది. తిరుపతి సమీపంలో ఎర్రచందనం తరలించేందుకు సిద్ధమైన వారిపై తిరుపతి టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై ఆకస్మికంగా దాడి చేశారు. రూ. 3.5 కోట్ల విలువైన 155 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో 10 మంది పరారీ కావడంతో గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను విచారిస్తున్నారు. ఎర్రచందనం తరలింపు వెనుక ఎవరున్నారనే కోణంలో నిందితులను ప్రశ్నలు కురిపిస్తున్నారు. త్వరలో అసలు దుండగలను పట్టుకుంటామని తెలిపారు.