డబ్బులు కడితే దొంగ దొరవుతాడా?: మంత్రి కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...

Update: 2024-12-17 17:29 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని గోదాములో బియ్యం మాయం, డబ్బులు కడతామాన్ని వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. డబ్బులు కాజేసి తిరిగి కడితే దొంగ దొర అవుతాడా ప్రశ్నించారు. ప్రజలను దోచుకుని పేర్ని నాని అడ్డంగా బుక్కయ్యారని ఆరోపించారు. పేర్ని నాని అరాచకాలను, అవినీతిని ఉపేక్షించమని హెచ్చరంచారు. గతంలో చేసిన అన్ని స్కాములను వెలికి తీసి కఠినంగా శిక్షిస్తామన్నారు. 3780 బస్తాలు, 108 టన్నులు 90 లక్షలు ఖరీదు చేసే బియ్యాన్ని పేర్ని నాని సొంత గోడౌన్ నుంచి పోర్టు ద్వారా తరలించారని తెలిపారు. నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని ఏ గోడ దూకి పారిపోయాడని ఎద్దేవా చేశారు. అవినీతి దాహానికి ఇంట్లో ఆడవాళ్ళని కూడా రోడ్డుమీద తీసుకువచ్చి నిలబెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

పేదలను భయపెట్టి బెదిరించి భూములు లాక్కొని అవినీతి గోడౌన్లు నిర్మించి వాటిలో బియ్యాన్ని అమ్ముకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ గోడౌన్లలో ఒక్క గింజ కూడా పెట్టనివ్వలేదన్నారు. వైయస్సార్ పార్టీ ఒక దొంగల పార్టీ అని విమర్శించారు. జగన్ ఒక దొంగల నాయకుడు అని, ఇవాళ వారు చేసిన భాగవతాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయన్నారు. వైసీపీ హయాంలో ఐదు లక్షల టన్నుల బియ్యం మాయమైపోయాయన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలను వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. బినామీలను పెట్టుకుని పేర్ని నాని దోచుకున్న ఆస్తుల చిట్టా మొత్తం తన దగ్గర ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 

Tags:    

Similar News