Pedana: మద్యం మత్తులో బ్లేడుతో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మద్యం సేవించిన ఓ వ్యక్తి బ్లేడుతో దాడి చేయగా.. ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన కృష్ణా జిల్లాలో(Krishna District) చోటు చేసుకుంది.

Update: 2024-12-15 14:53 GMT

దిశ, వెబ్ డెస్క్: మద్యం సేవించిన ఓ వ్యక్తి బ్లేడుతో దాడి చేయగా.. ఇద్దరు వ్యక్తులు గాయపడిన ఘటన కృష్ణా జిల్లాలో(Krishna District) చోటు చేసుకుంది. పెడన(Pedana) పట్టణంలో పేరిశెట్టి చరణ్ అనే వ్యక్తి మద్యం మత్తులో బ్లేడు(Blade)తో ఇద్దరు వ్యక్తులపై దాడికి తెగబడ్డాడు. అదే గ్రామానికి చెందిన బెనర్జీ, శివలతో ఘర్షణ పడిన చరణ్ తాగిన మత్తులో బ్లేడుతో ఇద్దరిపై దాడి చేశాడు. ఇది చూసిన స్థానికులు చరణ్ ను అడ్డుకొని పోలీసులకు(Pedana Police) సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. గాయపడిన వారిని అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడు చరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పెడన పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News