రట్టి సముద్ర తీరం సమీపంలో విషాదం.. గల్లంతైన యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టి సముద్ర తీరం సమీపంలో విషాదం చోటు చేసుకుంది...

Update: 2024-12-15 15:18 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టి సముద్ర తీరం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో గల్లంతై యువకుడు మృతి చెందారు. స్నేహితులతో కలసి మహావీర్ రట్టి సముద్రతీరానికి పిక్నిక్‌కు వెళ్లారు. అనంతరం సరదాగా సముద్ర స్నానానికి దిగారు. అయితే అలల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన మహావీర్ కోసం గాలించి మృతదేహం వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News