విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం.. కాపర్ వైరు ఎత్తుకెళ్లిన దుండగులు
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన పాతురప్ప వ్యవసాయ తోటలో నిన్న రాత్రి దుండగులు ట్రాన్స్ఫర్మర్ పగలగొట్టి కాపర్ వైరు దొంగలించారు.
దిశ,కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన పాతురప్ప వ్యవసాయ తోటలో నిన్న రాత్రి దుండగులు ట్రాన్స్‌ఫార్మర్ పగలగొట్టి కాపర్ వైరు దొంగలించారు. మొన్న అదే గ్రామంలో పాల్ టెక్నికల్ కళాశాలలో కూడా ఇలానే చేశారు. రెండు రోజుల క్రితం ముదిగల్లు లో ఇదే విధంగా రైతు పొలాల్లో ఎత్తుకెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. పోలీసులు స్పందించి దుండగులను పట్టుకుని రైతులకు మేలు చేయాలని కోరుతున్నారు.