విశాఖ డెయిరీ వద్ద పాడి రైతుల ఆందోళన
విశాఖ డెయిరీ వద్ద పాడి రైతుల ఆందోళనకు దిగారు...
దిశ, వెబ్ డెస్క్: విశాఖ డెయిరీ(Visakha Dairy) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెయిరీ బిల్డింగ్ వద్ద పాడి రైతులు(Farmers) ఆందోళనకు దిగారు. పాల ధర(Milk Price) పెంచాలంటూ డిమాండ్ చేశారు. యాజమాన్యం తమకు న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. రైతులు డెయిరీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పాల ధరలు పెంచే వరకూ నిరసన వ్యక్తం చేస్తామంటూ డెయిరీ బిల్డింగ్ వద్ద బైఠాయించారు. దీంతో రైతులు, ఆందోళనకారులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. అయితే తమ ఆందోళనను కొనసాగిస్తామని రైతులు తెలిపారు. కాగా ఈ ధర్నాలో రైతులు, వారి కుటుంబ సభ్యులు భారీగా పాల్గొన్నారు.