District Collector:జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గల ICDS ప్రాజెక్టులైన పాడేరు, ఏ రంపచోడవరం డివిజన్ లలో పీఎం జనమన్ స్కీంలో కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దిశ,పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గల ICDS ప్రాజెక్టులైన పాడేరు, ఏ రంపచోడవరం డివిజన్ లలో పీఎం జనమన్ స్కీంలో కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు 2024 డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారికి నేరుగా గాని పోస్ట్ ద్వారా గాని దరఖాస్తు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేయదలచిన మహిళలు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, ప్రధానంగా స్థానికంగా నివాసం కలిగి ఉండాలని వివాహిత స్త్రీ అయి ఉండాలని కలెక్టర్ తెలిపారు. 2024 జూలై 1 నాటికి అభ్యర్థులు 21 సంవత్సరాలు పూర్తి చేసి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు. 21 సంవత్సరాల లోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18 సంవత్సరాలు పూర్తయిన వారి దరఖాస్తులు పరిశీలించబడతాయని, అయితే కేవలం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎంపికలో పదవ తరగతి ఉత్తీర్ణత 50 మార్కులు, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ /క్రిషి / ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్ మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికెట్ కలిగిన వారు , సీ ఈ సీ వర్కర్ గా పనిచేయుచున్న వారికి (ప్రైవేటు స్కూల్స్, కాన్వెంట్స్ పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడవు) కలిగి ఉన్న అభ్యర్థులకు ఐదు మార్కులు, వితంతువులకు ఐదు మార్కులు, మైనర్ పిల్లలు కలిగి ఉన్న వితంతువులకు ఐదు మార్కులు, పూర్తి అనాధ, క్రెచ్ హోమ్, ప్రభుత్వ సంస్థలలో నివశించు సత్ప్రవర్తన సర్టిఫికెట్ కలిగిన వారికి 10 మార్కులు, అర్హత కలిగిన వికలాంగ వ్యక్తులకు ఐదు మార్కులు మౌఖిక పరీక్షకు 20 మార్కులు మొత్తం 100 మార్కులకు లెక్కించబడుతుంది అని తెలిపారు. మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో నియామకాలు జరుగుతాయని ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దని, వారి అర్హతలను, మార్కులను పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.