Big Alert: టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం..!

ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్(Exam Shedule) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

Update: 2024-12-18 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షల షెడ్యూల్(Exam Shedule) ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 17 నుంచి 31 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పరీక్షలకు హాజరయ్యే విదార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దరఖాస్తు సమయంలో కొందరు విద్యార్థులు తమ వివరాలను తప్పుగా నమోదు చేస్తారు. ఈ మేరకు వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. తప్పులను ఎడిట్(Edit) చేసుకోవడానికి ఈ నెల 19 నుంచి 23 వరకు ఛాన్స్ ఇస్తున్నట్లు పేర్కొంది. స్టూడెంట్ పేరు(Student Name), పేరెంట్స్ నేమ్స్(Parents Names), డేట్ ఆఫ్ బర్త్(DOB), మీడియం(Medium) వంటి వివరాలను ఎడిట్ చేసుకోవచ్చని, స్కూల్ హౌస్ మాస్టర్(HM) తమ ఆన్ లైన్ లాగిన్(Login) ద్వారా తప్పుల సవరణలు చేయవచ్చని వెల్లడించింది.

టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ ఇదే..

  • మార్చి 17 - ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21 - ఇంగ్లీష్
  • మార్చి 24 - మ్యాథ్స్
  • మార్చి 26 - ఫిజిక్స్
  • మార్చి 28 - బయాలజీ
  • మార్చి 29 - ఒకేషనల్
  • మార్చి 31 - సోషల్ స్టడీస్ 
Tags:    

Similar News