నల్లమల అడవుల్లో దారితప్పిన 15 మంది భక్తులు.. కాపాడిన ఫారెస్ట్ అధికారులు
ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో దోర్నాల నుంచి శ్రీశైలం దేవస్థానం మార్గమధ్యంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లిన 15 మంది భక్తులు బుధవారం సాయంత్రం దారి తప్పి అడవిలోకి వెళ్లి చిక్కుకుపోయారు.
దిశ, బాపట్ల: ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో దోర్నాల నుంచి శ్రీశైలం దేవస్థానం మార్గమధ్యంలో ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్లిన 15 మంది భక్తులు బుధవారం సాయంత్రం దారి తప్పి అడవిలోకి వెళ్లి చిక్కుకుపోయారు. భయాందోళనకు గురైన భక్తులు సుమారు 6 గంటల సమయంలో డయల్ 100కి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక ఫారెస్ట్ అధికారులను అప్రమత్తం చేయడంతో, గాలింపు చర్యలు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో రాత్రి 7:00 సమయంలో భక్తులు అడవిలో ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం వారు ఫారెస్ట్ అధికారుల సంరక్షణలో ఉన్నారు. దారితప్పిన 15 మంది భక్తులు బాపట్ల జిల్లా రేపల్లె మండలం మంత్రిపాలెం గ్రామానికి చెందినవారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.