Breaking: బాపట్ల జిల్లాలో ఘోరం.. ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన బాపట్ల జిల్లాలో ఘటన జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన బాపట్ల జిల్లా(Bapatla District)లో ఘటన జరిగింది. స్కూటర్(Scooter)ను టిప్పర్(Tipper) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళతో పాటు వ్యక్తి దుర్మరణం చెందారు. మృతులు పర్చూరు మండలం అన్నంభొట్లవారిపాలెం(Annambhotlavaripalem)కి చెందిన వారిగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.