AP: అధికారుల మెరుపు దాడులు.. భారీగా రేషన్ బియ్యం పట్టివేత

రెండు జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమ తరలింపును అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు....

Update: 2024-12-06 04:33 GMT

దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం(Ration rice) అక్రమ తరలింపుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కాకినాడ పోర్టు(Kakinada Port) నుంచి విదేశాలకు తరలిపోతున్న టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే రేషన్ బియ్యం తరలింపు వ్యవహారంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అధికారులు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయినా అక్రమార్కులు ఆగడం లేదు. యదేచ్ఛగా రేషన్ బియ్యాన్ని అక్రమం తరలిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

తాజాగా రెండు జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమ తరలింపును అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం(Prakasam), కడప(Kadapa Districts) జిల్లాల్లో భారీగా రేషన్ బియ్యం తరలించే ప్రయత్నం చేశారు. రైస్ మిల్లుల(Rice mills) కేంద్రం జరుగుతున్న ఈ గుట్టును రట్టు చేశారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు(UppuGundur)లో 1500 బస్తాల రేషన్ బియ్యంను గుర్తించారు. వియత్నాం(Vietnam)కు ఎగుమతి చేసేందుకు రైస్ మిల్లు రెడీ చేసింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మిల్లుపై దాడి చేశారు. 1500 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మిల్లును సీజ్ చేసినట్లు సమాచారం. అటు కడప జిల్లాలోనూ ఇదే తంతు జరుగుతోంది. మైదుకూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు(Vigilance officers) గుర్తించారు. చెన్నై పోర్టు(Chennai Port)కు లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం లారీని మైదుకూరు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News