రైతులకు గుడ్ న్యూస్... మంత్రి గొట్టిపాటి రవి కీలక ప్రకటన

రైతులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుడ్ న్యూస్ తెలిపారు...

Update: 2024-12-14 11:43 GMT

దిశ, వెబ్ డెస్క్: రైతులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) గుడ్ న్యూస్ తెలిపారు. రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం(Bapatla Parliamentary Constituency) మేదరమెట్ల(Medarametla)లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు డబ్బు చెల్లిస్తున్నామన్నారు. వైసీపీ(YCP) హయంలో ఉన్న ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. బియ్యం(Rice), ఇసుక(Sand) అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు ఎవరు చేసినా ఉపేక్షించమని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హెచ్చరించారు. 

Tags:    

Similar News