రోజూ పెరుగు తినవచ్చా..?

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్ని రుచులు ఉన్నా.. పెరుగు టెస్టే వేరు. కూరగాయల భోజనమైనా, బిర్యాణీలు ఉన్నా.. చివరలో రెండు ముద్దలైనా పెరుగుతో ఆరగించనిది తిన్న తృప్తే ఉండదు. కడుపు నిండిన ఫీలింగ్ ఉండదు. సామాన్యుడు నుంచి కుబేరుడి వరకు పెరుగన్నం తినకుండా ఉండలేడనడంతో సందేహం లేదు. అయితే పెరుగును రోజూ తినవచ్చా? పెరుగు వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. దివ్య ఔషధంగా పెరుగు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు పెరుగు(Curd) చక్కగా ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని […]

Update: 2021-04-15 22:02 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్ని రుచులు ఉన్నా.. పెరుగు టెస్టే వేరు. కూరగాయల భోజనమైనా, బిర్యాణీలు ఉన్నా.. చివరలో రెండు ముద్దలైనా పెరుగుతో ఆరగించనిది తిన్న తృప్తే ఉండదు. కడుపు నిండిన ఫీలింగ్ ఉండదు. సామాన్యుడు నుంచి కుబేరుడి వరకు పెరుగన్నం తినకుండా ఉండలేడనడంతో సందేహం లేదు. అయితే పెరుగును రోజూ తినవచ్చా? పెరుగు వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

దివ్య ఔషధంగా పెరుగు

జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు పెరుగు(Curd) చక్కగా ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. మూత్ర సంబంధ రోగాలకు, జిగురు విరేచనాల నివారణకు దివ్య ఔషధంగా పని చేస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగు పర్చడంతోపాటు ఎపెండిసైటిస్ రాకుండా కాపాడుతుంది. శరీర బరువును పెంచుతుంది. అదే బరువు తగ్గాలంటే ఓ కప్పు పెరుగులో జీలకర్ర పొడి కలుపుకుని తీసుకుంటే తగ్గిపోతారు. అల్సర్, గ్యాస్ట్రిక్, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్నిస్తుంది. నిద్రపట్టని వారికి పెరుగు ఓ చక్కటి మెడిసిన్‌గా పని చేస్తుంది. జలుబును సైతం పెరుగు నివారిస్తుంది. చర్మ వ్యాధులను నివారించడంతోపాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. 100 గ్రాముల పెరుగులో 60 కేలరీల శక్తి, 4.7 గ్రాముల పిండిపదార్థాలు, 3.3 కొవ్వు పదార్ధాలు, 121 గ్రాముల కాల్షియం, 3.5 గ్రాముల మాంసకృత్తులతోపాటు విటమిన్ ఏ, బి2 తదితర పోషకాలు మెండుగా ఉంటాయి. రోజూ పెరుగు(Curd) తీసుకోవడం వల్ల శరీరానికి మంచిదే కానీ చెడు ఏమాత్రం చేయదు అనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News