Stock Markets: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) సోమవారం నష్టాల్లో ముగిశాయి.

Update: 2024-10-21 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ఉదయం గ్లోబల్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆ జోరును ఎక్కువసేపు కొనసాగించలేకపోయాయి. ముఖ్యంగా ప్రముఖ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో క్రమక్రమంగా సూచీలు స్వల్ప నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 81,770 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలయ్యింది. ఇంట్రాడేలో 80,811 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 73.48 పాయింట్ల నష్టంతో 81,151.27 దగ్గర స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 72 పాయింట్ల నష్టంతో 24,781 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.31 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.07 దగ్గర ముగిసింది.

Stock Markets: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్

నష్టపోయిన షేర్లు : టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ పెట్రోలియం, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్     


Similar News