Maruti Suzuki Swift: మారుతీ సుజికీ దీపావళి ఆఫర్.. స్విఫ్ట్ కారుపై రూ.50,000 వరకు డిస్కౌంట్..!

దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజికీ(Maruti Suzuki) దీపావళి ఫెస్టివల్(Diwali Festival) సీజన్ సందర్భంగా కొత్త కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-10-21 14:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజికీ(Maruti Suzuki) దీపావళి ఫెస్టివల్(Diwali Festival) సీజన్ సందర్భంగా కొత్త కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్ స్విఫ్ట్(Swift) పై ఏకంగా రూ.50,000 వరకు డిస్కౌంట్(Discount)ను అందిస్తోంది. రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు వేరియంట్‌ను బట్టి రూ. 10,000 నుండి రూ. 35,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే మారుతి కొత్తగా ప్రారంభించిన VXi మరియు VXi (O) వేరియంట్‌ లను కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ బదులుగా బ్లిట్జ్ కిట్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఇక మాన్యువల్ ట్రాన్స్ మిషన్ MT వేరియంట్‌పై రూ. 25,000 తగ్గింపు AMTపై రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. కార్పొరేట్ కొనుగోలుదారులు రూ. 2,100 తగ్గింపును కూడా పొందవచ్చు. అలాగే సెలెక్టెడ్ ట్రిమ్‌ల కోసం రూ. 19,000 వరకు డీలర్-ఎండ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్త స్విఫ్ట్ యొక్క CNG వేరియంట్‌ కారుపై ఎటువంటి ఆఫర్లు లేవని, కానీ ఈ కారును కొనుగోలు చేసిన వారికీ బ్లిట్జ్ కిట్‌ను ఫ్రీగా అందిస్తామని  పేర్కొంది. ఈ కొత్త  స్విఫ్ట్ ధర రూ. 6.49(EX-Showroom) లక్షల నుండి రూ. 9.59 లక్షల వరకు ఉంది. ఇది Z-సిరీస్ 3-సిలిండర్ ఇంజిన్ , AMT గేర్‌బాక్స్‌తో 25.75 kmpl వరకు మైలేజీ అందిస్తోంది.


Similar News